Advertisementt

ప్రభాస్ ప్రాజెక్ట్ కె పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Sun 25th Jul 2021 03:24 PM
prabhas,project k update,project k,nag ashwin,prabhas - nag asgwin movie,prabhas - deepika padukone,amithab  ప్రభాస్ ప్రాజెక్ట్ కె పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on Prabhas Project K ప్రభాస్ ప్రాజెక్ట్ కె పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మూవీ నిన్న హైదరాబాదులో అఫిషియల్ గా మొదలైంది. ప్రారంభ సన్నివేశాలను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ పై షూట్ చేసారు నాగ్ అశ్విన్. అయితే నిన్న హైదరాబాద్ లో మొదలైన ప్రాజెక్ట్ కె కేవలం ట్రయిల్ షూట్ కోసమే అని, అసలైన షూట్ అప్పుడే మొదలు పెట్టడం లేదట. ప్రభాస్ ఆదిపురుష్ - సలార్ మూవీ షూటింగ్స్ కి హాజరవుతూ డేట్స్ అడ్జెస్ట్ చెయ్యగానే నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కె ని పట్టాలెక్కిస్తాడట. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కె అంటే.. నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీకి టైటిల్ అనుకున్నా.. ఇప్పుడే ఎందుకు రివీల్ చెయ్యడమని, ముద్దుగా ఈ సినిమాని ప్రాజెక్ట్ కె అంటూ ఇంట్రెస్ట్ పెంచుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ ఎప్పుడో ఫిక్స్ అయినా.. టైటిల్ వదిలేస్తే సినిమా కథ గెస్ చేసి కథలు అల్లేస్తారనే భయంతో నాగ అశ్విన్ టైటిల్ దాచేసి ఇప్పుడు ఆ సినిమాకి జస్ట్ ప్రాజెక్ట్ కె అంటూ పిలుస్తున్నారట. ఆ టైటిల్ కె తో మొదలవుతుంది అని, అందుకే ప్రాజెక్ట్ కె అంటూ పెట్టారట. ఇక ఈ ట్రయిల్ షూట్ లో పాల్గొనే నటులు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోని క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరికొంతమంది కీలక నటులతో ఫిలిం నగర్ లోని ఓ హోటల్ ఫుల్ అయినట్లుగా ఫిలిం నగర్ టాక్. ఈ జాగ్రత్తలన్నీ వైజయంతి మూవీస్ దగ్గరుండి చూసుకుంటుందట. 

Interesting news on Prabhas Project K:

Prabhas Project K update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ