Advertisementt

బెల్లంకొండ కి హీరోయిన్ దొరికేసిందా

Sun 25th Jul 2021 02:23 PM
bellamkonda sai sreenivas,vinayak,debut in bollywood,chatrapathi remake  బెల్లంకొండ కి హీరోయిన్ దొరికేసిందా
Did Bellamkonda find a heroine? బెల్లంకొండ కి హీరోయిన్ దొరికేసిందా
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసేసుకున్నాడు. వి.వి వినాయక్ తో కలిసి ఛత్రపతి రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీకి వెళ్ళిపోతున్నాడు. మొన్నటి వరకు ముంబై లోనే తచ్ఛిట్లాడిన శ్రీనివాస్ ఇప్పుడు షూటింగ్ కోసం హైదరాబాద్  కి వచ్చేసాడు. హైదరాబాద్ లోనే ఛత్రపతి రీమేక్ కోసం భారీ సెట్ వేయించారు. వర్షాలకు అది పాడవగా, తర్వాత మరమత్తులు చేయించి సినిమా పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టేసారు. ఈ సినిమా కోసమా బెల్లంకొండ కండలు పెంచి సూపర్ మేకోవర్ అయ్యాడు. అయితే ఇప్పుడు అధికారికంగా మొదలైన ఈ సినిమాలో హీరోయిన్ విషయంగా అందరిలో ఆశక్తి పెరిగిపోయింది. 

ఎప్పుడు టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే బెల్లంకొండ కి బాలీవుడ్ భామలు పడడం లేదనే టాక్ ఉంది. బెల్లకొండ చెక్కులకి ఎవరూ పడడం లేదని, అలియా భట్, సారా అలీ ఖాన్ లాంటి వాళ్ళు బెల్లకొండ సరసన నటించడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని అంటున్నారు. మరి ఛత్రపతిలో శ్రియ నటించిన ప్లేస్ లో ఈ రీమేక్ లో ఏ హీరోయిన్ వస్తుందో అనే ఆసక్తి అందరిలో అంతకంతకు ఎక్కువపోతుంది. మరి ప్రస్తుతం శ్రీనివాస్ - వినాయక్ లు ఛత్రపతి రీమేక్ షూటింగ్ లో బిజీగా వున్నారు. 

Did Bellamkonda find a heroine?:

Bellamkonda Sai Sreenivas to debut in Bollywood Chatrapathi remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ