Advertisementt

దృశ్యం 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే

Sun 25th Jul 2021 01:05 PM
venkatesh,narappa movie,venky drishyam 2,drushyam 2 movie,ott release,venkatesh drushyam 3,venky narappa  దృశ్యం 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే
Venkatesh Drishyam 2 OTT Release Date Locked? దృశ్యం 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే
Advertisement
Ads by CJ

వెంకటేష్ నటించిన నారప్ప మూవీ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో నారప్ప కి పాజిటివ్ ప్రమోషన్స్, మౌత్ టాక్ తో నారప్ప మంచి హిట్ ని సొంతం చేసుకుంది. అయితే వెంకీ మరో చిత్రం దృశ్యం 2 కూడా ఓటిటికి వెళ్లబోతుంది అనే విషయం తెలిసిందే. సురేష్ బాబు కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో సినిమాలు ఓటిటికి అమ్మడం తప్ప వేరే మార్గం లేదంటూ తేల్చేసారు. హాట్ స్టార్ ఓటిటి దృశ్యం 2 కి భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు దృశ్యం 2 ని ఓటిటి నుండి రిలీజ్ చెయ్యబోతున్నారు. 

అయితే ఈ సినిమాని హాట్ స్టార్ ఓటిటి నుండి వినాయక చవితి అంటే.. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. నారప్ప ఓటిటి నుండి రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఓ నెల గ్యాప్ ఇచ్చి దృశ్యం 2 ని రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. మలయాళంలో హిట్ అయిన దృశ్యం 2 కి రీమేక్ అయిన ఇందులో వెంకీ సరసన మీనా నటించింది. భారీ అంచనాలున్న ఈ సినిమాని 9 లేదా 10 తేదీలలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుందని.. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

Venkatesh Drishyam 2 OTT Release Date Locked?:

Drishyam 2 OTT premiere date locked?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ