Advertisementt

కారు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్: పరిస్థితి విషమం

Sun 25th Jul 2021 11:36 AM
bigg boss tamil fame,yashika aannand,yashika severely injured,car accident  కారు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్: పరిస్థితి విషమం
Yashika Anand critical after car accident కారు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్: పరిస్థితి విషమం
Advertisement
Ads by CJ

తమిళనాడులోని మామల్లపురం సెంటర్ మీడియన్‌ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్ యషిక అండ్ తీవ్ర గాయాల పాలై ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన ఇంజినీర్ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందింది. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్టు గా పోలీస్ లు భావిస్తున్నారు. బిగ్ బాస్ ద్వారానే కాకుండా.. తమిళంలో పలు సినిమాలతో పాపులర్ అయిన యషిక ఆనంద్ కి ఈ ప్రమాదంలో తీవ్రమైన గాయాలు అయినట్టుగా, ఆమె పరిస్థితి విషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 

మరో ఇద్దరు యాషిక ఫ్రెండ్స్ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని, వారిని మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించినట్టుగా తెలుస్తుంది. యషికా ఢిల్లీలో పుట్టి, చెన్నైలో సెటిల్ అయిన నటి.  ఫ్యాషన్ మోడల్‌ గాను టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన యషిక 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరస సినిమాలతో ఆమె కెరీర్ సాఫ్ట్ గా సాగిపోతున్న తరుణంలో ఆమెకి ఈ ప్రమాదం జరగడం ఆమె ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. యషిక త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. 

Yashika Anand critical after car accident:

Bigg Boss Tamil Yashika Aannand severely injured after car accident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ