కన్నడ నుండి టాలీవుడ్ లో జెండా పాతేసి.. ఇప్పుడు బాలీవుడ్ లోను జెండా పాతడానికి రెడీ అయ్యింది చిట్టి పొట్టి రష్మిక. తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నా రష్మిక, శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లులో నటిస్తుంది. షూటింగ్ తో అలసిపోయినా.. జిమ్ లో వర్కౌట్స్ చేసే రష్మిక కి ఫిట్ నెస్ అంటే ప్రాణం. అందుకే ఎంత టైం లేకపోయినా కొద్దిసేపైనా జిమ్ లో కుస్తీలు పడుతుంది.
ఇక బాలీవుడ్ మూవీస్ కోసం ముంబైలో ఉంటున్న రష్మిక అక్కడ కూడా జిమ్ కి, నైట్ పార్టీస్ అంటూ బాలీవుడ్ కల్చర్ ని వంటబట్టించుకుంటుంది. బాలీవుడ్ భామలు ఎయిర్ పోర్ట్ స్టయిల్, జిమ్ స్టయిల్, షూటింగ్ స్టయిల్ అంటూ చాలా ఫోజులు కొడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న రశ్మికకి బాలీవుడ్ నీళ్లు బాగా వంట బట్టించుకుంది. అందుకే ఎయిర్ పోర్ట్ లో చిట్టి పొట్టి ఫ్రాక్ తో దిగిపోయింది. షూటింగ్స్ తో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఫ్లైట్ ఎక్కి దిగుతున్న రష్మిక ఇలా ఎయిర్ పోర్ట్ లో బాలీవుడ్ స్టయిల్ ల్లో కనిపించేసరికి పోరికి బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టాయి.. అందుకే బాలీవుడ్ స్టయిల్లో ఫోజులు కొడుతోంది అంటున్నారు నెటిజెన్స్.