ఆచార్య మూవీ తర్వాత రామ్ చరణ్ - కోలీవుడ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం RC15 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఓ రేంజ్ లో జరుగుతున్న విషయం సోషల్ మీడియాలో తరుచు చూస్తున్నాం. ఈ సినిమా కోసం ఎక్కువగా తెలుగుకు టచ్ ఉన్న టెక్నీకల్ టీం నే శంకర్ సెలెక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని తీసుకున్న శంకర్ RC15 సాంగ్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ లో RC15 పూజా కార్యక్రమాలు జరుగుతాయనే న్యూస్ ని దిల్ రాజు కూడా కన్ ఫర్మ్ చేసేసారు.
అంతా మంచి అనుకున్న టైం లో దర్శకుడు శంకర్ డెసిషన్ ఇప్పుడు మెగా ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. అంటే దర్శకుడు శంకర్ ఈ సినిమాని పాన్ ఇండియా లేవల్లోనే తెరకెక్కిస్తున్నారు. అయితే ఈసినిమా ఓ ఐదారు భాషల్లో తెరకెక్కుతుంది అనుకున్నారు. యూనివర్శల్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి.. ఈ సినిమాని భారీగా విడుదల చేయాలని అనుకున్నా... ఇప్పుడు శంకర్ RC15 ని కేవలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే తెరకేక్కిన్చాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. వీలైనన్ని ఎక్కువ భాషల్లో ఈ సినిమాని భారీగా తీస్తారని ప్రచారం జరుగుతోన్న టైం లో.. ఇప్పుడీ వార్త బయటకు రావడం ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.