టాలీవుడ్ మొత్తం సెకండ్ వేవ్ పూర్తి కాగానే.. మెల్లగా అందరూ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. భారీ బడ్జెట్ మూవీస్, పాన్ ఇండియా ఫిలిమ్స్, చిన్నా చితక షూటింగ్స్ తో టాలీవుడ్ కళకళలాడుతుంది. ఇంత జరుగుతూన్నా రవితేజ ఖిలాడీ రెస్యూమ్ షూట్ మాత్రం మొదలు కాలేదు. కానీ రవితేజ కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ మాత్రం జోరుగా మొదలుపెట్టేసాడు. తాజాగా ఖిలాడీ షూటింగ్ పై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఖిలాడీ ఫైనల్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు.. కానీ అక్కడ షూటింగ్ కోసం పర్మిషన్ రాలేదు.
ఆ షెడ్యూల్ షూట్ హైదరాబాద్ లో కానిచ్చేస్తున్నారు. ఇక్కడే దుబాయ్ సెట్ వేస్తున్నారు అంటూ ఏవేవో కథనాలు చక్కర్లు కొడుతున్న టైం లో ఖిలాడీ టీం ఖిలాడీ రెస్యూమ్ షూట్ పై అధికారిక ప్రకటన ఇచ్చేసింది. జులై 26 నుండి ఖిలాడీ షూట్ రెస్యూమ్స్ అంటూ పోస్టర్ తో సహా ప్రకటించింది. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడు. రవితేజ సరసన మీనాక్షి శేషాద్రి, డింపుల్ హయ్యాతి నటిస్తున్నారు.