కోలీవుడ్ నటుడు ఆర్య హీరోయిన్ సయేశా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సయేశా హీరోయిన్ గా సూర్య లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. హీరోయిన్ గా బిజీగా గా సినిమాలు చేస్తున్న టైం లోనే ఆర్య తో లవ్ లో పడిన సయేశా 2019 లో ఆర్య ని వివాహమాడింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో బిజీ అయిన ఈ జంట... మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఈ క్యూట్ కపుల్ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మించింది. సయేశా గత రాత్రి ఆడపిల్లకి జన్మనిచ్చినట్టుగా హీరో విశాల్ ఆర్యకి శుభాకాంక్షలు తెలిపాడు. దానితో ఆర్య - సయేశా దంపతులకు ఆడపిల్లల జన్మనిచ్చినట్టుగా తెలిసింది. ఇక ఆర్య నటించిన సార్పట్ట రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఆర్య సార్పట్ట కి పాజిటివ్ కాదు.. హిట్ రివ్యూస్ వచ్చాయి. సో అటు కెరీర్ లోనే కాదు ఇటు పర్సనల్ గాను ఆర్య సూపర్ హ్యాపీ అన్నమాట.