Advertisementt

శిల్పా శెట్టి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం

Fri 23rd Jul 2021 10:42 PM
raj kundra case,crime branch,reaches,shilpa shetty,juhu residence,fresh raids likely  శిల్పా శెట్టి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం
Shilpa Shetty is also likely to be arrested శిల్పా శెట్టి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం
Advertisement
Ads by CJ

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో పోలీస్ కష్టడికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 23 వరకు పోలీస్ కష్టడీలో ఉన్న రాజ్ కుంద్రా ని మరో మూడు రోజులు కోర్టు పోలీస్ కష్టడికి ఇచ్చింది. రాజ్ కుంద్రా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నోరు విప్పడం లేదట. ఇక ఫిబ్రవరిలో రాజ్ అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్ లకి 25 లక్షలు లంచం ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ రోజు శిల్ప శెట్టి కి ముంబై పోలీస్ లు సమన్లు జారీ చేసారంటూ వార్తలు రావడం.. శిల్పా శెట్టికి ఎలాంటి సమన్లు జారీ చెయ్యలేదని ఓ పోలీస్ అధికారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. 

ఇక ఈ రోజు ముంబై లోని జుహులో రాజ్ కుంద్రా - శిల్పా శెట్టి ఇంటికి వెళ్లిన ముంబై పోలీస్ లు శిల్ప శెట్టి ఇంటిని సోదా చేసి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. జేఎల్ స్టీమ్‌ కంపెనీ వ్యవహారాల్లో శిల్పాశెట్టి గతంలో చురుకుగా వ్యవహరించారు. ఆ సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌కు ప్రచారం చేశారు. ఇప్పడు అదే కంపెనీపై కేసు నమోదు అయ్యింది. అయితే ఇప్పుడు ఈ కేసులో నటి శిల్ప శెట్టి ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. 

ఇక రాజ్ కుంద్రా యొక్క మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు దాని విషయాలను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని, అతని వ్యాపార వ్యవహారాలను లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. పోలీస్ కష్టడిలో రాజ్ కుంద్రా పోలీస్ లకి సహకరించడం లేదని తెలుస్తుంది. 

Shilpa Shetty is also likely to be arrested:

Raj Kundra case: Crime Branch reaches Shilpa Shetty Juhu residence; fresh raids likely

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ