Advertisementt

ఖిలాడీని పక్కనపడేసిన రవితేజ?

Fri 23rd Jul 2021 08:42 PM
ravi teja,raviteja khiladi movie,khiladi dubai plans get delayed,khiladi movie,ravi teja - ramesh varma combo  ఖిలాడీని పక్కనపడేసిన రవితేజ?
Khiladi Dubai plans get delayed ఖిలాడీని పక్కనపడేసిన రవితేజ?
Advertisement
Ads by CJ

ఈ ఏడాది క్రాక్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడీ మూవీ మే 28 న రిలీజ్ కి రంగం చేసేసాడు. కానీ సెకండ్ వేవ్ వలన రవితేజ ప్లాన్స్ ప్లాప్ అయ్యాయి. ఖిలాడీ ఫైనల్ షెడ్యూల్ పూర్తికాకుండానే షూటింగ్ వాయిదా పడిపోయింది. ఇక సెకండ్ వేవ్ తగ్గి అందరూ సినిమా షూటింగ్స్ కి సిద్దమవడమే కాదు.. టాలీవుడ్ మొత్తం షూటింగ్స్ తో కళకళలాడిపోతుంది. కానీ రవితేజ ఖిలాడీ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఖిలాడీ టీం మళ్ళీ ఇటలీ వెళుతుంది అన్నారు. కాదు హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తుంది అన్నారు. కానీ ఖిలాడీ కొత్త షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదు. 

కారణం ఖిలాడీ లాస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరగాల్సి ఉండగా.. దుబాయ్ లో చిత్రీకరణ జరపడానికి పర్మీషన్ ఇంకా రాలేదు. దానితో రవితేజ ఖిలాడీ మూవీ షూటింగ్ పక్కన పడేసి తన కొత్త మూవీ రామారావు ఆన్ డ్యూటీ షూట్ లో బిజీ అయ్యాడు. ఇక ఖిలాడీ షూటింగ్ ఆగస్టు ఫస్ట్ వీక్ లో అయినా మొదలెట్టాలని రమేష్ వర్మ చూస్తున్నాడట. అందుకే దుబాయ్ షెడ్యూల్ ని హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని అనుకుంటున్నారట. దానికోసం దుబాయ్ మాదిరిగా సెట్స్‌ను నిర్మించి షూట్ పూర్తి చేయాలని యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తికాగానే ఖిలాడీ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. 

Khiladi Dubai plans get delayed:

Raviteja Khiladi Dubai plans get delayed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ