Advertisementt

ఎలగెలగా.. కౌశల్ పీపుల్ స్టారా

Fri 23rd Jul 2021 04:40 PM
bigg boss 2 winner,kaushal manda,kaushal new movie launch,kaushal as people star  ఎలగెలగా.. కౌశల్ పీపుల్ స్టారా
Bigg Boss 2 Winner Kaushal Manda Announces People Star ఎలగెలగా.. కౌశల్ పీపుల్ స్టారా
Advertisement
Ads by CJ

సీరియల్ ఆర్టిస్ట్ కౌశల్ మండా.. బిగ్ బాస్ 2 ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుని ఓ హీరోలా బయటికి వచ్చాడు. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక కౌశల్ చేష్టల అతి మాములుగా లేదు. బిగ్ బాస్ తర్వాత హీరో మాదిరి ఫోజులు కొట్టాడు. అప్పుడప్పుడు కౌశల్ ఆర్మీ అంటూ హడావిడి చేసే కౌశల్ హీరోగా సినిమా చెయ్యబోతున్నాడని అన్నారు. కౌశల్ ఆర్మీనే కౌశల్ హీరోగా సినిమా మొదలెట్టేసేలా ప్రచారం  జరిగింది. కానీ బిగ్ బాస్ ని వదిలి ఏళ్ళు గడుస్తున్నా కౌశల్ కెరీర్ లో బిజీ అయ్యిందే లేదు. 

కానీ తాజాగా కౌశల్ హీరోగా ఓ సినిమా మొదలైన విషయాన్నీ ఫాన్స్ తో పంచుకోవడమే కాదు.. తనని తాను పీపుల్ స్టార్ గా ప్రకటించేసుకున్నాడు. అందరూ అంటే అభిమానులంతా తనని పీపుల్ స్టార్ గా పిలుస్తూ అన్నా మీరు హీరోగా సినిమా ఎప్పుడు మొదలు పెడతారు అంటూ అడుగుతున్నారు. నా అభిమానుల కోరిక తీరబోతుంది. అదే నేను హీరోగా చెయ్యబోతున్న రైట్ మూవీ మొదలైంది అంటూ ఓపెనింగ్ షాట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు ఓకె.. కానీ కౌశల్ తనని తాను పీపుల్ స్టార్ గా పరిచయం చేసుకోవడమేమిటో అంటూ నెటిజెన్స్ కౌశల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. 

Bigg Boss 2 Winner Kaushal Manda Announces People Star:

Bigg Boss 2 Winner Kaushal Manda new movie launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ