Advertisementt

బాలయ్య అధ్యక్షుడైతే ఓకె.. లేదంటే..

Thu 22nd Jul 2021 04:34 PM
balakrishna garu,balayya,manchu visnu,maa president,manchu vishnu,maa elections  బాలయ్య అధ్యక్షుడైతే ఓకె.. లేదంటే..
If Nandamuri Balakrishna become MAA president?: Manchu Vishnu బాలయ్య అధ్యక్షుడైతే ఓకె.. లేదంటే..
Advertisement
Ads by CJ

మా ఎన్నికల్లో భాగంగా ప్రకాష్ రాజ్.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లుగా చెప్పడమే కాదు.. హడావిడిగా ప్యానల్ ని ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టి మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు చెప్పడం, వెంటనే ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్, అటు తర్వాత మంచు విష్ణు లేఖ, తాజాగా చాన్సల్స్ కి ఇంటర్వ్యూ.. అన్నిఇప్పుడు టాలీవూడ్ ని కుదిపేస్తున్నాయి. మధ్యలో మురళి మోహన్, బాలకృష్ణ కూడా మా ఎన్నికల విషయం కదపడంతో ఇప్పుడు మా ఎన్నికల వేడి మరింతగా రాజుకుంది. తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ.. పరిశ్రమ పెద్దలంతా కూర్చుని మాట్లాడుకుని మా అధ్యక్షున్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. నేను ఎన్నికల నుండి త్పపుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

అంతేకాకుండా బాలకృష్ణ నాకు సోదరుడు లాంటివారు. ఒకేవేళ అందరూ బాలయ్యని మా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నాకు అభ్యంతరం లేదు. బాలకృష్ణ అయితే పరిశ్రమకి మంచి జరుగుతుంది. బాలకృష్ణ తరం నటులు చాలామంది ఎప్పుడూ మా కి పోటీ చెయ్యలేదు. వారిలో ఎవరైనా నాకు ఓకె. కాకపోతే వాళ్ళకి పరిశ్రమ కష్టలు, సమస్యలు తెలుసుకునే అవకాశం, టైం ఉండకపోవచ్చు. ఇక మెగా బ్రదర్ నాగబాబు నాకు తండ్రిలాంటి వారు. ఆయన్నంటే నాకెంతో ఇష్టం. అయన మా భవనం ప్లానింగ్ గురించి అడిగారు టైం వచ్చినప్పుడు అన్ని చెబుతానుఆ అంటూ మంచు విష్ణు బాలయ్యని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తే ఓకె .. లేదంటే నేను నిలబడతాను మా ఎన్నికలు జరగడం తథ్యం అన్నట్టుగా మాట్లాడారు విష్ణు. 

If Nandamuri Balakrishna become MAA president?: Manchu Vishnu :

Will support Balakrishna garu for President: Manchu Vishnu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ