విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజీ మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఛార్మి, పూరి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ షూటింగ్ మొత్తం ముంబై పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. సెకండ్ వేవ్ తర్వాత లైగర్ షూటింగ్ కోసం పూరి అండ్ ఛార్మి లు అన్ని ఏర్పాట్లు చేసుకుని విజయ్ దేవరకొండ కూడా లైగర్ షూటింగ్ లో పాల్గొందామనుకున్న టైం కి అక్కడ ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తడంతో.. ప్రస్తుతం లైగర్ షూటింగ్ ని ఆపాల్సిన పరిస్థితి. కరోనా పోయింది అనుకుంటే.. ఈ భారీ వర్షాలతో షూటింగ్స్ అన్ని అతలాకుతలం అయ్యాయి.
అయితే తాజాగా పూరి జగన్నాధ్ లైగర్ మూవీ క్లైమాక్స్ షూట్ కోసం భారీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది లైగర్ క్లైమాక్స్ షూట్ కోసం యూరప్ వెళ్లే ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే పూరి జగన్నాధ్ యూరప్ లో లైగర్ షూటింగ్ కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారని, ఒక్కసారి యూరప్ లో లొకేషన్స్ సెట్ అయ్యి షూట్ ఫిక్స్ అయితే.. సింగిల్ షెడ్యూల్‌లో టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. షూటింగ్స్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి లైగర్ ని ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.