కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నాట్ ఏ కామన్ మ్యాన్ షూట్ లో పాల్గొంటున్నారు. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గగానే.. విశాల్ నాట్ ఏ కామన్ మ్యాన్ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో నాట్ ఏ కామన్ మ్యాన్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న విశాల్ ఆ సీన్స్ లో కాస్త గాయపడినా.. మళ్ళీ వెంటనే కోలుకుని ఆయన నాట్ ఏ కామన్ మ్యాన్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. అక్కడ విశాల్ ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సీసా తాకడం వల్ల కొద్దిమేర గాయపడినా వెంటనే కోలుకున్నారు.
అయితే తాజాగా నాట్ ఏ కామన్ మ్యాన్ సెట్స్ లో విశాల్ మరోమారు తీవ్రగాయాలపాలైనట్లుగా తెలుస్తుంది. శరవణనన్ దర్శకుడు గా తెరకెక్కుతున్న విశాల్‌కు ఇది 31వ సినిమా. ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఆ షూట్ విశాల్‌తో పాటు పలువురు నటీనటులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. దానితో యూనిట్ షాక్ కి గురైంది. ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. అయితే విశాల్ వెన్నుపూసకు దెబ్బ బలంగా తాకింది అని యూనిట్ చెబుతుంది. ప్రస్తుతం విశాల్ ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది.