ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Yesterday to Hyderabad, today to RRR sets

నిన్న హైదరాబాద్ కి, నేడు RRR సెట్స్ కి

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెకెకుతున్న ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. సెకండ్ వేవ్ తర్వాత రీసెంట్ గా మొదలు పెట్టిన షూట్ లో ఆర్.ఆర్.ఆర్ కీలక నటులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ఆర్.ఆర్.ఆర్ లాస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. నిన్న సాయంత్రమే హైదరాబాద్ కి వచ్చిన అలియా భట్ నేడు ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో జాయిన్ అయ్యింది. 

సీత పాత్రధారి అలియా భట్ - అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ పై ఓ సాంగ్ చిత్రీకరణ చేపట్టింది టీం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సారధి స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్.ఆర్.ఆర్ కి సంబందించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెలలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లిపోవడమే కాదు.. రాజమౌళి చెప్పినట్టుగా అక్టోబర్ 13 న సినిమా రావడం పక్కా అంటున్నారు. త్వరగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని అలియా ముంబై కి వెళ్లిపోనున్నట్టుగా తెలుస్తుంది. 

Alia bhatt joins RRR sets

Yesterday to Hyderabad, today to RRR sets
rrr pan india movie
ntr with ram charan
ram charan as alluri sita ramaraju
komaram bheem as ntr
rajamouli
jakkanna
ntr rrr movie
ram charan rrr movie
rajamouli rrr
d.v.v danayya
dvv entertainment
alia bhatt
ajay devagan