బాలకృష్ణ జోరు పెంచారు. వరస సినిమాలతో నందమూరి ఫాన్స్ కి సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ మూవీని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్న బాలకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నారు. ఆ తర్వాత కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ ని కూడా కన్ ఫర్మ్ చేసేసారు బాలయ్య. ఇక కొడుకు మోక్షజ్ఞ ని ఆదిత్య 369 సీక్వెల్ తో ఎంట్రీ ఇప్పించడమే కాదు.. దానికి బాలయ్యే డైరెక్టర్ అని ఫిక్స్ కూడా అయ్యింది.
ఇక తాజాగా బాలకృష్ణ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో మూవీని లైన్ పెట్టేసారు. గతంలో పైసా వసూల్ తో ప్లాప్ కొట్టిన ఈ జంట ఈసారి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే మూవీని చెయ్యబోతుందట. అంతేకాదు బాలయ్య లైన్ అప్ లో మరో బిగ్ బ్యానర్ వచ్చి చేరింది. అది హరికాఅండ్‌హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో బాలయ్య కి ఓ కమిట్మెంట్ ఉందట. ఆ సినిమా తర్వాత బాలయ్య పూరి సినిమా చెయ్యబోతున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య లైన్ అప్ చూసి నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.