బాలీవుడ్ లో పెద్దమనుషులుగా చలామణి అవుతూ.. చిల్లర పనులు చేస్తున్న నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా ని ఈరోజు ముంబై పోలీస్ లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బడా వ్యాపారాల ముసుగులో పోర్న్ సినిమాల భాగోతం ఇప్పుడు రాజ్ కుంద్రాకి ఊపిరి ఆడనివ్వడం లేదు. గతంలో చాలావిషయాల్లో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా ఈసారి ఇంత పెద్ద కేసులో ఇరుక్కోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ఫిబ్రవరిలోనే రాజ్ కుంద్రా పై నీలి చిత్రాల ఆరోపణలు రావడంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి నేడు రాజ్ కుంద్రాని పోలీస్ కష్టడికి తీసుకున్నారు.
అయితే రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా.. ఓ మూడు రోజుల పాటు రాజ్ కుంద్రా పోలీస్ కష్టడీలో ఉంటారని తెలుస్తుంది. అంటే జులై 23 వరకు ఆయన పోలీస్ కష్టడీలో ఉంటారట. ఇప్పటికే ఓ నటి అవకాశం కోసం అడిగితె కెమెరా ముందు అలా నటిస్తావా అని రాజ్ కుంద్రా అడిగారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతోనే రాజ్ కుంద్రాని పోలీస్ లు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. పోలీస్ కష్టడీలో ఉన్న రాజ్ కుంద్రాపై ప్రశ్నలు వర్షం కురిపించేందుకు పోలీస్ లు రెడీ అయినట్లుగా సమాచారం.
ఈ కేసులో ఎక్కువగా రాజ్ కుంద్రా పేరే వినిపిస్తుండగా.. ఇంకా బిగ్ స్టార్స్ ఎవరైనా ఉన్నారా అనే అనుమానంలో ఇవెస్టిగేషన్ మొదలు పెట్టినట్లుగా టాక్.