Advertisementt

విరాటపర్వం రిలీజ్ పై దర్శకుడు క్లారిటీ

Tue 20th Jul 2021 03:40 PM
rana,sai pallavi starrer,virata parvam movie,virata parvam release soon,venu udugula,director  విరాటపర్వం రిలీజ్ పై దర్శకుడు క్లారిటీ
Director Venu udugula Clarity on Virata Parvam release విరాటపర్వం రిలీజ్ పై దర్శకుడు క్లారిటీ
Advertisement
Ads by CJ

సురేష్ బాబు తన తమ్ముడు వెంకటేష్ నటించిన నారప్ప సినిమాని ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడమే కాదు.. ఆయన కొడుకు రానా - సహజనటి సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా కూడా మంచి బిజినెస్ డీల్ ఓటిటీల నుండి వస్తే.. అమ్మేస్తామని చెప్పడంతో విరాట పర్వం ఆల్మోస్ట్ ఓటిటి లోనే రిలీజ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ విరాట పర్వం ఓటిటి రిలీజ్ హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా న్యూస్ ఉంది. 

అయితే తాజాగా విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల పుట్టిన రోజు సందర్భంగా ఆయన విరాట పర్వం రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. విరాట పర్వం మూవీ ఓటిటిలో రిలీజ్ చెయ్యడం లేదని.. ఆ వార్తల్లోనిజం లేదని తెలిపిన ఆయన.. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా విరాట పర్వం కి సంబందించిన ఓ నాలుగు రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది అని.. అది రానా - సాయి పల్లవిలపై చిత్రీకరించాల్సి ఉంది అని.. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. 

Director Venu udugula Clarity on Virata Parvam release:

Rana And Sai Pallavi Starrer Virata Parvam Movie Release Soon 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ