Advertisementt

బాలీవుడ్ కి వెళుతున్న మరో యంగ్ హీరో

Tue 20th Jul 2021 03:25 PM
satyadev,bollywood debut,akshay kumar,ram setu bollywood movie,tollywood young hero,young hero satya dev  బాలీవుడ్ కి వెళుతున్న మరో యంగ్ హీరో
Another young hero going to Bollywood బాలీవుడ్ కి వెళుతున్న మరో యంగ్ హీరో
Advertisement
Ads by CJ

ఇప్పుడు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మూవీస్ తో నార్త్ లో జెండా పాతడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రభాస్ బాహుబలితో బలంగా నార్త్ లో నాటుకుపోయాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్, లైగర్ తో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ పుష్ప తో నార్త్ ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయ్యారు. అయితే మిగతా యంగ్ హీరోస్ అక్కడ నార్త్ లో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ హీరోలుగా అడుగుపెడుతున్నారు. అందులో నాగ చైతన్య ఇప్పటికే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా లో ఓ గెస్ట్ రోల్ కోసం ముంబై వెళ్ళాడు. 

తాజాగా మరో యంగ్ హీరో బాలీవుడ్ కి గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అతనే బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి డిఫ్రెంట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకున్న సత్య దేవ్. సత్య దేవ్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రామ్ సేతు మూవీలో గెస్ట్ రోల్ కాదు కీలక పాత్ర చేయబోతున్నాడట. అంటే సత్య దేవ్ కి రామ్ సేతు డెబ్యూ హిందీ మూవీ అవుతుంది. ఇక సత్య దేవ్ తెలుగులో నటించిన తిమ్మరుసు రేవు 30 న విడుదలకు సిద్దమవుతుండగా.. ఈ హీరో చేతిలో ఇంకా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

Another young hero going to Bollywood:

Satyadev to make Bollywood debut with Akshay Kumar Ram Setu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ