గత ఏడాదిన్నరగా కరోనా క్రైసిస్ సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేసింది. సినిమా షూటింగ్స్, రిలీజ్ డేట్స్ అన్ని ఆగిపోయాయి. ఆఖరుకి సినిమా కార్మికులకు తిండి లేకుండా పోయింది. కరోనా లాక్ డౌన్ సినిమా జీవితాలను పాతాళంలోకి తొక్కేసింది. ఈ ఏడాది మొదట్లో కరోనా తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేసి షూటింగ్స్ జరిగినా సెకండ్ వేవ్ తో మరోసారి షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినిమా రిలీజ్ డేట్స్ ఆగిపోయాయి. ఇక సెకండ్ వేవ్ ఓ కొలిక్కి వచ్చి సినిమా షూటింగ్స్ మొదలయ్యాయి.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న టైం లో ఇప్పుడు వర్షాకాలం రావడం, వరస వర్షాలతో సినిమా సెట్స్ దెబ్బతినడంతో మళ్ళీ మొదలైన సినిమా షూటింగ్స్ కి అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పుష్ప షూటింగ్ కి వర్షాల వలన సెట్ పాడయ్యి అంతరాయం కలగగా.. రీసెంట్ గా అఖిల్ ఏజెంట్ మూవీ మొదలైన రెండు రోజులకె వర్షాల వలన ఆగిపోయింది. ఇక మొన్నామధ్యన ఛత్రపతి రిమేక్ కోసం వేసిన సెట్స్ కూడా వర్షాల కారణముగా పాడైపోయింది. కరోనా తో నిర్మాత ఒక విధంగా లాస్ అయితే.. ఇప్పుడు అకాలవర్షాల కారణంగా నిర్మాత మరింత నష్టపోయారు.
ఇక ఇవి ఇలా ఉంటే.. ఎక్కువగా సెట్స్ మీద ఆధారపడే సినిమాల మాటేమిటో అంటున్నారు ఫాన్స్. అందులో పవన్ - క్రిష్ కాంబో హరిహర వీరలమల్లు కూడా ఉంది. ఈ సినిమా కి ఎక్కువగా సెట్స్ కావాల్సి వస్తుంది. ఇప్పటికే చాలారకాల సెట్స్ ఈ మూవీ కోసం నిర్మించారు కూడా. మరి వాటి పరిస్థితి ఏమిటో..