పిఎస్వి గరుడ వేగ, కల్కి, జాంబి రెడ్డి, అ! మూవీస్ తో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా తేజ సజ్జా తో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. గరుడ వేగ తర్వాత స్టార్ హీరో తో సినిమా చేస్తాడని అనుకున్నప్పటికీ.. కల్కి తో రాజశేఖర్ మరో అవకాశం ఇచ్చారు. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా నిలబడడానికి చాలా ఇబ్బందులు పడినట్లుగా చెప్పుకొచ్చాడు. ఏ దర్శకుడిని అయినా హీరోలు వాళ్ళ టాలెంట్ ని బట్టే అవకాశాలు ఇస్తుంటారు. ఓ వ్యక్తి డెబ్యూ డైరెక్టర్ అవడానికి ఎంతగా ఇబ్బందులు పడతారో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న వారు అంతే ఇబ్బందులు పడి ఉంటారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం చెప్పింది వింటే.. హీరోల్లో ఇలా దయాదాక్షిణ్యాలు లేని వారు కూడా ఉంటారా అనిపిస్తుంది.
ప్రశాంత్ నీల్ కథ చెప్పడానికి ఓ హీరో ఇంటికి వెళ్ళాడట. ఆయన వెళ్లిన టైం కి అనుకొకుండా అక్కడ భారీ వర్షం మొదలైందట . ఆ హీరో రమ్మంటేనే ప్రశాంత్ వర్మ ఆ హీరో ఇంటికి వెళ్ళాడట. అయితే గేట్ బయట ఉండి కాల్ చేస్తే.. ఆయన మాత్రం వెంటనే లోపలికి రమ్మనకుండా అక్కడే వర్షంలో వెయిట్ చేయించాడట. అంత పెద్ద వర్షంలో తడిచిపోతూ అక్కడే నిలబడినా ఆ హీరో మాత్రం ఇంట్లోకి రమ్మనలేదు. అయితే నేను గేటు బయట వర్షంలో తడుస్తున్న విషయం ఆ హీరో మాత్రం తన ఇంటి కిటికీ నుండి చూస్తున్న విషయాన్ని గమనించాను. ఆ దృశ్యం నేను ఎప్పటికి మరిచిపోలేను అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.