Advertisementt

RC15 హీరోయిన్ ఆల్మోస్ట్ ఫిక్స్

Tue 20th Jul 2021 12:22 PM
ram charan,charan romance rashmika mandanna,rc15,rashmika mandanna  RC15 హీరోయిన్ ఆల్మోస్ట్ ఫిక్స్
RC15 Heroine Almost Fix RC15 హీరోయిన్ ఆల్మోస్ట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కబోతున్న RC15 అప్ డేట్ సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సెప్టెంబర్ లో మొదలు కాబోతున్న RC15 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతుంది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ RC15 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చురుగ్గా కదులుతున్నారు. అందులో భాగంగానే డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రని, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసారు. సెన్సేషనల్ కాంబో గా మొదలు కాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. 

ఇక తాజాగా రామ్ చరణ్ కి జోడి కట్టే హీరోయిన్ విషయంలోనూ శంకర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటి నుండి RC15 కి రామ్ చరణ్ కి సరసన కియారా అద్వానీ పేరు వినిపిస్తుండగా.. మధ్యలో పూజ హెగ్డే, రష్మిక, అలియా భట్ పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే తాజాగా పుష్ప తో పాన్ ఇండియా ఫిలిం, అలాగే బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న రష్మిక మందన్నా అయితే రామ్ చరణ్ పక్కన ఫ్రెష్ గా ఉంటుంది అని శంకర్ అండ్ దిల్ రాజులూ భావిస్తున్నారట. ప్రస్తుతం రష్మిక పేరే RC15 కి గట్టిగా వినిపించడం కాదు.. ఆల్మోస్ట్ రశ్మికనే RC15 హీరోయిన్ అంటున్నారు. 

RC15 Heroine Almost Fix:

Ram Charan to romance Rashmika mandanna in RC15

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ