ఏపిలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న పరిస్థితి.. నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ ఇచ్చిన హామీని విశ్వసించి అన్ని సీట్లు ఇస్తే అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలు ఇస్తామనడంతో యువత తాము వంచనకు గురయ్యామని ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఎక్కడ రెండున్నర లక్షల ఉద్యోగాల హామీ... ఎక్కడ పది వేల ఉద్యోగాల భర్తీ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండరుపై ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తూ జనసేన పార్టీ మంగళవారం అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారి కార్యాలయంలో వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రెండున్నర లక్షల ఉద్యోగాల హామీని నిరుద్యోగ యువత నమ్మింది.
పట్టు బట్టలు, బంగారం ఇవ్వక్కరలేదు. చక్కటి భవిష్యత్ ఇవ్వండి చాలు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుంది అని మరోసారి స్పష్టం చేశారు