మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను నటిస్తున్న ఓ సినిమా కోసం హైదరాబాద్ కి వచ్చారు. మలయాళ హీరో పృథ్వి రాజ్ దర్శకత్వంలో బ్రోడాడి మూవీ షూటింగ్ కోసం మోహన్ లాల్ హైదరాబాద్ కి వచ్చారు. గత వారమే పృథ్వి రాజ్ తన టీం తో హైదరాబాద్ కి వచ్చినట్లుగా టీం అప్ డేట్ ఇచ్చింది. కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వి రాక్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న బ్రోడాడి సినిమా షూటింగ్ లో మోహన్ లాల్ నిన్నటి నుండి పాల్గొంటున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్, పృథ్వి రాజ్ పై కొన్ని కీలక యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. రెండు వారల పాటు బ్రోడాడి టీం హైదరాబాద్ లో ఉండబోతుంది. గతంలో పృథ్వి రాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో చిరు హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇక పృథ్వి రాజ్ దర్శకత్వంలో రెండో మూవీగా ఈ బ్రోడాడి తెరకెక్కుతుంది అది కూడా మోహన్ లాల్ తో.. సో సినిమాపై అందుకే భారీ హైప్ ఏర్పడింది.