Advertisementt

చరణ్-శంకర్ RC15 మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Mon 19th Jul 2021 11:33 AM
ram charan - shankar combo,ss thaman,mega power star ram charan,sensational director shankar,dil raju -shirish duo,rc15,rc 15 update  చరణ్-శంకర్ RC15 మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
SS Thaman on board for RC15 చరణ్-శంకర్ RC15 మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీకి సంబందించిన సెన్సేషనల్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా షెకవుతుంది. మెగా ఫాన్స్ కి RC15 తో పండగ చేసుకుంటున్నారు. తాజాగా RC15 మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయినట్లుగా టీం ప్రకటించింది.  

RC15 మూవీకి మోస్ట్‌ హ్యపెనింగ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్‌ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్‌ రూపొందించిన బాయ్స్‌ సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురుచూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన వైశాలి(ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం. శంకర్‌గారు నిర్మించిన వైశాలి(ఈరం)కి ట్యూన్స్‌ ఇచినప్పుడు, ఆయన తొలి వెంటనే మ్యూజిక్‌ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది అని తమన్ గుర్తు చేసుకున్నారు.

ఇప్పటికే ఈ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ రికార్డింగ్‌ పనిని హైదరాబాద్‌లో.. ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు. ఈ పాటను రికార్డ్‌ చేయడానికి శంకర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ భారీ సాంగ్‌ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్‌చరణ్‌ కూడా భాగమయ్యారు. పాట విని చాలా ఎగ్జయిట్‌మెంట్‌కు ఫీలయ్యారు. ఈ భారీ బడ్జెట్‌ మూవీ దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తారు.

SS Thaman on board for RC15:

SS Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar movie with Dil Raju -Shirish duo 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ