Advertisementt

ప్రేక్షకుల చూపు.. ఓటిటిల ఊపు

Mon 19th Jul 2021 10:37 AM
ott release movies,narappa,venkatesh narappa,aarya tamil movie,kannada movies,bollywood movies,tamil and telugu movies  ప్రేక్షకుల చూపు.. ఓటిటిల ఊపు
OTT movies in this week ప్రేక్షకుల చూపు.. ఓటిటిల ఊపు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం థియేటర్స్ చాలావరకు క్లోజ్ అవడం వలన, కొన్ని సినిమాలు థియేటర్స్ కోసం వేచి చూడలేక, అలాగే కరోనా కష్ట కాలంలో ప్రేక్షకుల నాడి తెలియక ఓటిటి నుండి రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు. అందులో ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్ సినిమాలే ఓటిటి బాట పట్టడం ఇప్పుడు హాట్ టాపిక్. ఏది ఏమైనా కరోనా కష్ట కాలంలో సినిమాలు ఓటిటి నుండి రిలీజ్ అవడమే బెటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారు కొందరు. 

ఇక ఈ వారం ఓటిటి నుండి ముందుగా శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో వెంకటేష్ నటించిన నారప్ప ఈ రోజు నైట్ అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ కాబోతుంది. నారప్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

ఇక ఈ నెల 22 న అదే అమెజాన్ ప్రైమ్ నుండి తమిళ హీరో ఆర్య నటించిన పీరియాడికల్‌ డ్రామా సార్‌పట్ట రిలీజ్ కాబోతుంది. పా.రంజిత్‌ తెరకెక్కించిన చిత్రం సార్‌పట్ట ఈనెల 22న అమెజాన్ ప్రైమ్​లో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన కన్నడ ఫిలిం ఇక్కత్ కూడా  అమెజాన్ ప్రైమ్​లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కృతి కర్బందా నటించిన బాలీవుడ్ మూవీ 14 ఫెర.. జులై 23న జీ5 లో రిలీజ్ కానుంది. 

సౌత్ హీరోయిన్ ప్రణీత సుభాష్, బాలీవుడ్ హీరోయిన్ శిల్ప శెట్టి నటించిన బాలీవుడ్ మూవీ హంగామా2 జులై 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్ లో విడుదలకు సిద్దమైంది. 

మరో కన్నడ చిత్రం హీరో తెలుగు ఓటిటి ఆహా నుండి జులై 24న రిలీజ్ కి రెడీ అయ్యింది. 

ఇవి కాకుండ మరికొన్ని చిత్రాలు, అండ్ వెబ్ సీరీస్ సందడి కూడా ఓటిటి లో ఈ వారం సందడి చెయ్యబోతున్నాయి. 

OTT movies in this week:

This week OTT release movies list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ