సమంత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో హిందీ నుండి తెలుగు, తమిళ భాషలను షేక్ చేసింది. అంతేకాదు.. తెలుగు, తమిళంలో సమంత కి ఇప్పటికి అంటే పెళ్లయిన తర్వాత కూడా భీభత్సమైన క్రేజ్ ఉంది. అందుకే సమంత తో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కోసం దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నా సమంత మాత్రం ఆచి తూచి కేరెక్టర్స్ ఒప్పుకుంటుంది. అలా ఇప్పుడు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. శాకుంతలం లో టైటిల్ రోల్ పోషిస్తున్న సమంతపైనే గుణశేఖర్ హోప్స్ ఉన్నాయట.
అంటే గుణశేఖర్ తో స్టార్ హీరోలు సినిమా చెయ్యడానికి ముందుకు రావడం లేదు. దానితో ఆయన రానాతో హిరణ్యకశిప చేద్దామని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ రావడంతో సమంత ని ఒప్పించి శాకుంతలం ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవల్లో చేస్తున్నారు. అయితే ఇక్కడ సమంత క్రేజ్ ని వాడుకోవాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఎక్కువ శాతం సమంత కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని, అలాగే ఈ ప్రోజెక్ట్ లోకి మరీ పేరున్న నటుల్ని కాకుండా కాస్త ఫేమ్ ఉన్న నటులనే తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అన్నిటిలో సమంతానే హైలెట్ అయ్యేలా చూస్తున్నారట గుణశేఖర్. ఇక ప్రస్తుతం ఇండియాలోని కొన్ని చరిత్రాత్మ స్థలాలలో శాకుంతలం చిత్రికరణ కోసం లొకేషన్స్ ని సెట్ చేసుకుంటున్నారట.