రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్. పుష్ప ఫిలిం తో పాటుగా శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాలోనూ రష్మిక నటిస్తుంది. బాలీవుడ్ మూవీ ఆఫర్స్ తో ఎక్కువగా ముంబై లోనే ఉంటున్న రష్మిక ఈ మధ్యనే డైరీ రాయడం మొదలు పెట్టిందట. రష్మిక రాసె డైరీ తెరిచిన పుస్తకమే. అంటే రష్మిక రోజువారీ కార్యక్రమాలను ఆ డైరీలో రాయడమే కాదు.. ఆ డైరీ విషయాలను తన ఇన్స్టా పేజీ పోస్ట్ లో కూడా చేస్తుంది. తాజాగా రష్మిక పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్న విషయాన్నీ తెలియజెయ్యడమే కాదు.. ఆ షూట్ లో తనేం చేసిందో కూడా చెప్పుకొచ్చింది.
షూటింగ్ ఉండడం వలన ఈ రోజు ఎర్లీ గా లేచాను. ఎందుకంటే రీసెంట్ గానే పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్నాను. త్వరగా లేవడం వలన షూటింగ్ కి సమయానికి చేరుకున్నాను. సెట్ లోకి వెళ్ళగానే మా కేరెక్టర్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. దానికి సబందించిన రిహార్సల్స్ చేశాను. ఇక పుష్ప లో పెద్ద సీక్వెన్స్‌ను ఎంతో ఉల్లాసంగా చేసేశాం. ఇక అంతకు మించి పుష్ప షూటింగ్ విషయాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఇక త్వరగా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి కాస్త అలసటగా ఉన్నా జిమ్ కి వెళ్ళాను. అక్కడ జిమ్ లో ఒకరిది బర్త్ డే అయితే కేక్ కట్ చేయించాము. ఇక తర్వాత రూమ్ కి వచ్చేసి పెట్స్ తో ఆడుకుని పడుకున్నా అంటూ తాను డైరీలో రాసిన రోజువారీ కార్యకలాపాలను అభిమానులతో పంచుకుంది.