మెగా హీరో, చిరు తనయుడు రామ్ చరణ్ ఉపాసన కామినేని ని పెళ్లి చేసుకుని.. కామినేని ఇంటికి అల్లుడయ్యాడు. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన ని పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ ఉపాసన తో కలిసి తన ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఉపాసన అటు మెగా ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు అపోలో హాస్పిటల్ పనులని సమర్ధవంతంగా నిర్వర్తిస్తుంది. అలాగే కామినేని, ప్రతాప్ రెడ్డి ఫామిలీస్ లో సందడి చేసే ఉపాసన మెగా ఫ్యామిలి మెగా పార్టీలకు, మెగా సెలెబ్రేషన్స్ ని హోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా ఉపాసన చెల్లెలు, రామ్ చరణ్ మరదలు అనుష్పల కామినేని.. స్పోర్ట్స్ పర్సన్ అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీం ని పెళ్లి చేసుకోబోతున్నది. ఈ విషయాన్నీ ఉపాసన కామినేని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఉపాసన సిస్టర్ పెళ్లి పీటలక్కబోతున్నందుకు గాను మంచు లక్ష్మి, రకుల్, స్నేహ రెడ్డి లాంటి సెలెబ్రిటీస్ అనుష్పల కామినేని కి కంగ్రాట్స్ చెబుతున్నారు. అనుష్పాల - అర్మాన్ ల పెళ్లిని కామినేని ఫ్యామిలీ అంగరంగ వైభవంగా చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అర్మాన్ కేవలం అథ్లెట్ మాత్రమే కాదు.. ఆయన రేసర్ కూడా.