వెంకటేష్ తాజా చిత్రం నారప్ప మూవీ అమెజాన్ ప్రైమ్ నుండి మంగళవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నారప్ప ప్రమోషన్స్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అలాగే వెంకటేష్ కూడా నారప్ప మూవీ ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. అయితే థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాల్సిన నారప్ప సినిమాని ఇలా ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడం పై వెంకీ ఫాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. వెంకటేష్ కి కూడా నారప్ప ఓటిటి నుండి రిలీజ్ అవడం ఇష్టం లేదు. కాకపోతే నిర్మాతల మాటకు కట్టుబడాల్సి వచ్చింది.
తాజాగా నారప్ప ఇంటర్వ్యూ లో నారప్పని ఓటిటిలో రిలీజ్ చెయ్యడం పై వెంకటేష్ ఫాన్స్ కి సారి చెప్పారు. థియేటర్స్ ఓపెన్ అయినా, కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండడంతోనే నారప్ప ని ఓటిటి లో రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది అని, నిర్మాతలు లాస్ అవ్వకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వెంకీ ఫాన్స్ ని క్షమాపణ కోరాడు. ఇక రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నారప్ప పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను నారప్ప రీచ్ అవడం ఖాయంగానే కనిపిస్తుంది.