పవన్ హరిహర వీరమల్లుపై షాకింగ్ న్యూస్
Shocking news about Hari Hara Veera Malluపవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో హరిహర వీరమల్లు అనే పిరియాడికల్ డ్రామా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు ఏకే రీమేక్ షూట్ తో పాటుగా హరిహర వీరమల్లు షూట్ కి ప్రిపేర్ అవుతున్నారు. మరోపక్క ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుపై ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ - క్రిష్ మూవీ నుండి సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ళ తప్పుకున్నారట. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ప్రసాద్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.
అది కాస్త పాత విషయమే. అయితే ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ళ తీసిన కొన్ని సన్నివేశాలను పక్కనపడేసి.. ఆ సీన్స్ ని మరోసారి రీ షూట్ చెయ్యాలని క్రిష్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్ మూరెళ్ళ కెమెరా పని తనం నచ్చకే క్రిష్ ఆయన్ని తొలగించారని, ప్రసాద్ మూరెళ్ళకి - క్రిష్ కి తరుచు విభేదాలు రావడంతోనే ఆయన తప్పుకున్నారంటూ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని వలన సినిమా షూటింగ్ ఆలస్యం కావొచ్చని.. రిలీజ్ కూడా సంక్రాతి వదిలి వేసవికి షిఫ్ట్ అవ్వొచ్చని అంటున్నారు.
Hari Hara Veera Mallu shocking update






































