మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెంకటేష్ నారప్ప సినిమా ఓటిటి లో రిలీజ్ అవడంపై వెంకీ ఫాన్స్, థియేటర్స్ యాజమాన్యాలు చాలా గుర్రుగా ఉన్నారు. అయితే సురేష్ మాత్రం నారప్ప ప్రొడ్యూసర్స్ ఇష్టం.. నా చేతుల్లో ఏం లేదు.. అంటూ నారప్ప ఓటిటి రిలీజ్ పై కామ్ అయ్యారు. తాజాగా సురేష్ మాట్లాడుతూ.. ధనుష్ నటించిన అసురన్ మూవీ ఫస్ట్ హాఫ్ చూసి నిర్మాత థాను గారికి ఫోన్ చేసి ఈ సినిమా రీమేక్ చేయోచ్చు అంటూ రీమేక్ రైట్స్ అడిగితె.. ఆయన నేనూ ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. దానితో ఇద్దరం కలిసి సినిమాని నిర్మించాము.
నారప్ప షూట్ మొదలు పెట్టినప్పుడు ఓటిటి రిలీజ్ అనుకోలేదు. థాను గారు నిర్మించిన కర్ణన్ కరోనా సెకండ్ వేవ్ కి ముందు రిలీజ్ చెయ్యగా.. రెండు వారాలకే థియేటర్స్ క్లోజ్ అవడంతో కర్ణన్ కి నష్టాలొచ్చాయి. మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ అంటున్న సమయంలో నారప్ప థియేటర్స్ లో రిలీజ్ చేసి నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలా ఓటిటి కి ఇవ్వాల్సి వచ్చింది. థాను గారు ఫోన్ చేసి అమెజాన్ ప్రైమ్ నుండి మంచి డీల్ వచ్చింది అని అన్నారు. ఇక ఆయన అలా అన్నాక నేను ఏం చెయ్యలేకపోయాను.
వెంకటేష్ కి నారప్ప ఓటిటీ రిలీజ్ అసలు ఇష్టం లేదు. ఇలా ఎలా అని ఆలోచించాడు. ఫాన్స్ ఫోన్ చేసి ఫీలయ్యారు. ఇది కొత్త పద్దతి. ఓటీటీలు ఎప్పటికీ ఉంటాయి. థియేటర్లు కూడా ఎప్పటికీ ఉంటాయి. కానీ సినిమాని ఎప్పుడు ఎక్కడ విడుదల చేయాలని ఆలోచించుకోవాలి. నాకు కూడా థియేటర్లు ఉన్నాయి. నాకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుసు. కానీ ఓటిటి అనేది అశాశ్వతం. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయంటూ నారప్ప రిలీజ్ పై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.