టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి రాజుకుంటుంది. ప్రకాష్ రాజ్vs మంచు విష్ణు అన్న రేంజ్ లో టాలీవుడ్ ఉంది. మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ మా ఎన్నికలు, మా భవనంపై చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ ని పెంచుతున్నాయి. బాలకృష్ణ మంచు విష్ణుకి మద్దతుగానే మాట్లాడడంతో.. ఇప్పుడు నాగబాబు బాలకృష్ణ పై సెటైర్స్ వేస్తున్నారు. మా ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం వాళ్ళ ఇష్టం, ఇక్కడా మా ఎన్నికల్లో ఎవరైనా నిలబడవచ్చు.. ఎన్నికలు జరగడం తప్పు కాదు.. ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకోవడం అంత మంచి నిర్ణయం కాదు.
ఎవరు నించున్నారో, ఎవరిని ఎన్నుకోవాలన్నది మా సభ్యులు నిర్ణయిస్తారు. కాబట్టి కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే అని అంటున్నారు నాగబాబు. మురళి మోహన్ మా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటినుండే మా భవనం విషయంలో చర్చలు జరుగుతూన్నాయని.. మా భవనం కట్టే విషయం.. ఇంతకుముందు పనిచేసిన అధ్యక్షులంతా బాద్యులవుతారని ఆయన అన్నారు. మంచు విష్ణు ఏకగ్రీవమైతే ఎన్నికల నుండి తప్పుకుంటాను అన్నారు. అది అంత నిర్ణయం కాదు. ఆయనని పోటీ చేసి తన కెపాసిటీ ని ప్రూవ్ చేసుకోమనండి. మంచు విష్ణు ని స్వాగతిస్తున్నా అంటూ నాగబాబు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మట్లాడారు.