Advertisementt

సెకండ్ వేవ్ లేకపోతె.. థియేటర్స్ దగ్గర రచ్చే

Fri 16th Jul 2021 02:08 PM
kgf 2,yash and prashanth neel,kgf chapter 2,kgf 2 release date,yash,prashanth neel  సెకండ్ వేవ్ లేకపోతె.. థియేటర్స్ దగ్గర రచ్చే
Today Kgf 2 Box office Hungama missing సెకండ్ వేవ్ లేకపోతె.. థియేటర్స్ దగ్గర రచ్చే
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ తో షూటింగ్స్ వాయిదాలు పడడం, సినిమా రిలీజ్ లు ఆగిపోవడం అన్ని అనుకోకుండానే జరిగిపోయాయి. మే లో విడుదల కావాల్సిన అఖండ, ఆచార్య, ఏప్రిల్ లో రావాల్సిన లవ్ స్టోరీ, విరాట పర్వం, టక్ జగదీశ్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ అన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. ఆఖరికి ఈ రోజు థియేటర్స్ దగ్గర సందడి చెయ్యాల్సిన కన్నడ సంచలనం కెజిఎఫ్ 2 కూడా వాయిదా పడింది. కన్నడ నుండి ఎలాంటి అంచనాలు లేకుండానే పాన్ ఇండియాలోకి దూసుకొచ్చిన కెజిఎఫ్ మూవీ బాక్సాఫీసుని గడగడలాడించింది. యశ్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కెజిఎఫ్ ని ఎక్కడో నిలబెట్టేలా చేసాయి. 

అయితే కెజిఎఫ్ సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 మాములుగా అయితే జులై 16 న రిలీజ్ డేట్ ఇచ్చింది టీం. కానీ కరోనా అడ్డం పడిపోయింది. లేదంటే కెజిఎఫ్ 2 కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ బాక్సాఫీసుని గడగడలాడించేవారు. యశ్ - ప్రశాంత్ నీల్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుంది అని కెజిఎఫ్ టీజర్ లోనే చూసేసాం, అధీర గా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ నటులు కెజిఎఫ్ లో భాగమవడం,కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ భారీ హిట్ అవడంతో కెజిఎఫ్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలు నేడు థియేటర్స్ దగ్గర చూసేవాళ్ళము. కానీ సెకండ్ వేవ్ యశ్ ఫాన్స్ ఆత్రుతని, ఆసక్తిని అతలాకుతలం చేసింది. మరి కెజిఎఫ్ 2 డిసెంబర్ లో రిలీజ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. 

Today Kgf 2 Box office Hungama missing:

New release date for Yash and Prashanth Neel KGF 2 to be announced soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ