షణ్ముఖ్ జాస్వంత్ అంటే తెలియని వారుండరు. యూట్యూబ్ స్టార్. సూర్య వెబ్ సీరీస్ తో అదరగొట్టిన షణ్ముఖ్ మొన్నీమధ్యనే ఓ కార్ ఆక్సిడెంట్ చేసి వార్తల్లో నిలిచాడు. కారు తో స్కూటరిస్ట్ ని గుద్ది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన షణ్ముఖ్ పోలీస్ స్టేషన్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలా సోషల్ మీడియా స్టార్ కాస్తా న్యూస్ ఛానల్స్ కి స్టార్ గా మారాడు. ఇక బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయనతో లవ్ ఎఫ్ఫైర్ తోనూ షణ్ముఖ్ బాగా పాపులారిటీ సంపాదించాడు. అయితే సూర్య వెబ్ సీరీస్ తో ఆకట్టుకున్న షణ్ముఖ్ కొత్త కారు కొన్నాడు.
కారు కొనడంలో ఆశ్చర్యం లేదు కానీ.. సూర్య వెబ్ సీరీస్ బాగా క్లిక్ అవడంతో.. ఆ వచ్చిన డబ్బుతో ఓ 15 లక్షలు పెట్టి కొత్త కారు కొని ఆ కారుని, ఇది నేను హై.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో సూర్య మీద ట్రోల్స్ మొదలయ్యాయి. అప్పుడెప్పుడో పాత కారుతో ఆక్సిడెంట్ చేసావ్.. కనీసం కొత్త కారుని అయినా జాగ్రత్తగా నడుపు, కారు డ్రైవ్ చేస్తూ డ్రింక్ చేయకు అంటూ షణ్ముఖ్ ని నెటిజెన్స్ సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు.