Advertisementt

బన్నీ-సుక్కుతో ఒకేసారి.. పుష్ప విలన్ ఫహద్

Thu 15th Jul 2021 08:25 PM
fahadh faasil,pushpa pan india director,pushpa director sukumar,hero allu arjun  బన్నీ-సుక్కుతో ఒకేసారి.. పుష్ప విలన్ ఫహద్
Fahad Fazil about Sukumar And Allu arjun బన్నీ-సుక్కుతో ఒకేసారి.. పుష్ప విలన్ ఫహద్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప షూటింగ్ సికింద్రాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అలాగే విలన్ కేరెక్టర్ లో నటిస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు సుకుమార్. సెకండ్ వేవ్ కి ముందే ఫహద్ పుష్ప సెట్స్ లో జాయిన్ అయినా.. సెకండ్ వేవ్ వలన షూటింగ్ ఆగిపోవడంతో ఆయన చెన్నై వెళ్లిపోయారు. ఇక తాజాగా పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్న ఫహద్ పుష్ప సినిమా విషయాలను పంచుకున్నారు. 

అది పుష్ప సినిమాలో విలన్ గా నన్ను తీసుకోవడానికి ముందే.. నేను సుకుమార్ గారి సినిమాలు చూసాను. ఆయన ట్రీట్మెంట్ చాలా బావుంటుంది. ఆయన సినిమాలోని పాత్రాలు చాలా బాగా నచ్చుతాయి. అలాంటి డైరెక్టర్ తో ఓ సినిమా చెయ్యాలని ఉండేది. అలాగే బన్నీ సినిమాలు చూసాను. ఆయన డాన్స్ చాలా బాగా చేస్తారు. అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తే  బావుంటుంది అనుకున్నాను. కానీ ఒకేసారి ఇద్దరితో కలిసి నటించడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది అని.. అలాగే హ్యాపీగా ఉంది అంటూ ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఫహద్ మలయాళంలో నటించిన మాలిక్ తాజాగా ఓటిటి లో రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ తెచ్చుకుంది. 

Fahad Fazil about Sukumar And Allu arjun:

Fahadh Faasil says working with Sukumar and Allu Arjun is exciting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ