Advertisementt

హీరోయిన్ గానే కాదు..

Thu 15th Jul 2021 04:04 PM
taapsee pannu,taapsee pannu news,producer taapsee pannu,actress taapsee pannu  హీరోయిన్ గానే కాదు..
Tapsee pannu beings a new chapter as a producer హీరోయిన్ గానే కాదు..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో అవకాశాలు లేక, రాక బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ అలాగే పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలతో బిజీ అయిన తాప్సి.. ఓ బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటింగ్ చేస్తుంది. సినిమాలు, మధ్యలో వెకేషన్స్ తో హడావిడి చేసే తాప్సి.. బాలీవుడ్ లో గట్టి పోటి ఎదుర్కుంటూనే హీరోయిన్ గా నిలదొక్కుకుంటుంది. వరసగా హిట్స్ కొడుతూ హీరోయిన్ గా కెరీర్ ని ఓ దారిలోకి తెచ్చుకున్న తాప్సి ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది.  

తాప్సీ తన ఫ్రెండ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. తాను నిర్మించబోయే సినిమాల కోసం తాప్సి తన ప్రోడక్షన్ హౌజ్‌కు అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ అనే పేరును కూడా ఫిక్స్ చేసింది. తన నిర్మాణంలో మంచి కథలతో సినిమాలు చెయ్యాలని, కంటెంట్ ఆధారిత సినిమాలు నిర్మిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తన హోమ్ బ్యానర్ లో నిర్మించబోయే ఫస్ట్ మూవీలో తాప్సి హీరోయిన్ గా నటిస్తుందట. ఇక ప్రస్తుతం తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటిస్తుంది. అంతేకాదు తమిళ, హిందీ సినిమాలతోను తాప్సి ఫుల్ బిజినె. 

Tapsee pannu beings a new chapter as a producer:

Taapsee Pannu announces first movie as a producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ