రాత్రి 7. 30 ఎప్పుడు అవుతుందా స్టార్ మా లో కార్తీక దీపం సీరియల్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. పల్లెటూర్లలోనే కాదు...సెలబ్రిటీస్ కూడా కార్తీక దీపం ఫెవెరెట్స్ అయ్యారు. వంటలక్క - డాక్టర్ బాబు మధ్యలో విలన్ మోనిత అన్నట్టుగా గత నాలుగేళ్లుగా కార్తీక దీపం సీరియల్ ప్రసారం అయినా.. దానిని ఆదరించే ప్రేక్షకులు మాత్రం రోజురోజుకి పెరిగిపోతున్నారు. పదేళ్ళుగా విడిపోయిన కార్తీక్ - దీప ఒక్కటయ్యే క్షణంలో డాక్టర్ మోనిత ఇచ్చిన ట్విస్ట్ తో కార్తీక దీపం టిఆర్పి ఎక్కడికో వెళ్ళిపోయింది.
మోనిత కుట్రలో భాగంగా తన కడుపులోని బిడ్డకి కార్తీక్ తండ్రి అని.. ఈ నెల 25 న రిజిస్టర్ ఆఫీస్ లో తమ పెళ్లి అంటూ విర్రవీగుతున్న టైం లో.. అపార్ధం చేసుకున్న వంటలక్క దీప కార్తీక్ కి అండగా నిలబడి మోనిత భరతం పట్టె పనిలో ఉంది. పోలీస్ కంప్లీట్ ఇచ్చిన మోనితకి చుక్కలు చూపించడానికి దీప రెడీ అయ్యింది. దీప మోనిత ఇంటికెళ్లి మరీ నువ్వు చెప్పిన అదే 25 న నీ పెళ్ళో.. లేదంటే జైలో తేల్చుకోమని వార్నింగ్ ఇచ్చేసింది. మోనిత కార్తిక్ దీపం మొదలైన కొత్త నుండి చేసిన కుట్రలు దీప బయటికి తీస్తానని హెచ్చరిస్తుంది.
మోనిత అంటే ఇష్టపడే.. దుర్గ గుర్తున్నాడా? నీ రహస్యాలు తెలిసిన అంజి గుర్తున్నాడా? వాళ్ళిద్దరిని ఏసిపి ముందు నిలబెట్టి నీకు జైలు ఊచలు ఎలా ఉంటాయో చూపిస్తాను.. మా ఆయనతో పెళ్లి కావాలో, లేదంటే జైలో తేల్చుకోమంటూ మోనితకి దీప ఇచ్చిన వార్నింగ్ కి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.