కోలీవుడ్ హీరో విజయ్ తో తమిళ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ఈమధ్యన విజయ్ బీస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో.. ఆయన ఎంత కూల్ పర్సనో.. సెట్స్ లో అందరిపట్ల ఆయన తీసుకునే శ్రద్ద కి ఫ్లాట్ అయ్యా అంటూ చెప్పిన పూజ హెగ్డే బీస్ట్ షూటింగ్ లో జోరుగా పాల్గొంటుంది. ఇప్పటికే ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసిన పూజ హెగ్డే ఇప్పుడు విజయ్ తో కాంబో సీన్స్ చిత్రీకరణలో పాల్గొంటుంది. తాను బీస్ట్ షూట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బీస్ట్ షూటింగ్ కోసం పూజ హెగ్డే మేకప్ వేయించుకుంటుంది. అందంగా కనిపించాలంటే హీరోయిన్స్ కి మేకప్ తప్పనిసరి. ఆ మేకప్, హెయిర్ స్టయిల్ చేయించుకునే క్రమంలోనే ఓ పిక్ ని పూజ హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బీస్ట్ షూట్ కోసం రెడీ అవుతున్నా అంటూ షేర్ చేసింది. విజయ్ బీస్ట్ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఆకట్టుకుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ తో ఫస్ట్ టైం పూజ హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. దానికే పాప బాగా ఎగ్జైట్ అవుతుంది.