బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తమిళంలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ లో అమ్మ జయలలితగా నటించిన విషయం తెలిసిందే. అమ్మ జయలలిత పాత్రలో కంగనా అద్భుతంగా ఇమిడిపోయింది అనే విషయం తలైవి ట్రైలర్ లోనే చూసాం. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి కనిపించబోతున్న ఈ సినిమా ఎప్పుడో సెకండ్ వేవ్ కి ముందే విడుదల కావాల్సిఉంది. కానీ ఇండియా వ్యాప్తంగా కరోనా తో థియేటర్స్ మూత బడడంతో పోస్ట్ పోన్ చేసారు.
అయితే ఈమధ్యన తలైవి మూవీ ని ఓ బడా ఓటిటికి అమ్మెయ్యబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. తలైవి నిర్మాతలకు బడా ఆఫర్ ఇచ్చి ఓ ప్రముఖ ఓటిటి తలైవి డిజిటల్ రైట్స్ కొనేసింది అని, త్వరలోనే తలైవి ఓటిటి రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా తలైవి ఓటిటి రిలీజ్ పై కంగనా క్లారిటీ ఇచ్చింది.సెకండ్ వేవ్ తో పోస్ట్ పోన్ అయిన తలైవి చిత్రం విడుదల తేదీ మరోసారి ఖరారు కాలేదు అని.. తలైవి పై జరుగుతన్న అసత్య ప్రచారాన్ని, రూమర్స్ ని నమ్మకండి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ తలివి రిలీజ్ విషయంపై కంగనా క్లారిటీ ఇచ్చింది.