కరోనా ఫస్ట్ వేవ్ ని సమర్ధవంతగా ఎదుర్కున్న భరత్.. సెకండ్ వేవ్ విషయంలో చిగురుటాకులా వణికిపోయింది. సెకండ్ వేవ్ లోనే కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉధృతి ఓ కొలిక్కి వచ్చి ప్రజలు సాధారణ జీవితానికి అలవాటుపడుతున్న సమయంలో మరోసారి థర్డ్ వేవ్ హెచ్చరికలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డెల్టా వెరియెంట్, జికా వైరస్ లు అల్లాడిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి కానీ.. కొన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం తగదు అంటూ మెగా బ్రదర్ నాగబాబు థర్డ్ వేవ్ పై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నాగుబాబు.. మరోసారి కరోనా వైరస్ పై గొంతెత్తారు. ప్రభుత్వాలు సభలకు, సమావేశాలకు, పొలిటికల్ ర్యాలీలకు, అలాగే కొన్ని విషయాల్లో భక్తుల మనోభావాల కోసం తలొగ్గడం లాంటి విషయాలే కరోనా వ్యాప్తికి కారణమయ్యాయి. తాజాగా నాగబాబు కూడా అదే విషయంపై ట్వీట్ చేసారు. ఇంతకు ముందు అయితే భారత్ కరోనా మూడో వేవ్ ని అడ్డుకోగలదని నమ్మకం ఉండేది అని కానీ ప్రభుత్వం ఎప్పుడైతే కన్వర్ యాత్రకి అనుమతి ఇచ్చారో ఇక థర్డ్ వేవ్ వల్ల ప్రమాదం తప్పేలా లేదని ఇపుడు భారత్ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి ఈ యాత్రని ఆపాలి లేదా కరోనా మూడో వేవ్ ని ఆహ్వానించాలని అంటూ థర్డ్ వేవ్ పై కాస్త ఘాటుగానే స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు.