ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏదయ్యా అంటే దగ్గుబాటి కాంపౌండ్ మూవీస్ ఓటిటి నుండి రిలీజ్ అవడమే. థియేటర్స్ కష్టాలు తెలిసి కూడా సురేష్ బాబు ఇలా తన తమ్ముడు, తన కొడుకు సినిమాలను ఓటిటి కి అమ్మడం థియేటర్స్ యాజమాన్యానికి మింగుడు పడడం లేదు. వెంకటేష్ నారప్ప ఓటిటి డీల్ పూర్తి కావడం ఆ సినిమాకి ఓటిటి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. సినిమాని థియేటర్స్ కి ఇచ్చుకోవాలో.. లేదంటే ఓటిటి కి అమ్ముకోవాలో నిర్మాతలు ఇష్టం.. నాదేం లేదంటూ సురేష్ బాబు చేతులెత్తేశారు. నారప్ప, దృశ్యం 2 మూవీస్ ని థియేటర్స్ రిలీజ్ అంటూనే ఇలా ఓటిటికి అమ్మెయ్యడం వెనుక భారీ డీల్స్ జరిగినట్టుగా తెలుస్తుంది.
నారప్పని అమెజాన్ ప్రైమ్ దాదాపుగా 40 కోట్ల భారీ ధరకి కొనుగోలు చేసిందట. అందులోను శాటిలైట్ హక్కులు అదనం. అందుకే విక్రయించేసారు. మరోపక్క దృశ్యం 2 డీల్ కూడా సెట్ అయ్యింది అని.. అది కూడా 35 కోట్లకి ఓ బడా ఓటీటీకి కి విక్రయించేసినట్లుగా తెలుస్తుంది. నారప్ప అమెజాన్ ప్రైమ్ నుండి జులై 20 న రిలీజ్ అవ్వగానే.. దృశ్యం 2 డేట్ కూడా వదులుతారని తెలుస్తుంది. దృశ్యం 2 హాట్ స్టార్ ఓటిటికి అమ్మినట్లుగా టాక్. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక విరాట పర్వం డీల్ కూడా నడుస్తుంది అని.. అది కూడా రేపో మాపో ఓటిటి లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
థియేటర్స్ ఓపెన్ చేసినా థర్డ్ వేవ్ భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేలా లేరు.. ఓటిటీలు ఇంత భారీ ఆఫర్ ఇస్తుంటే వదులుకోవడమెందుకు అని దగ్గుబాటి బ్రదర్స్ అనుకుని ఇలా అమ్మేసారు అంటున్నారు నెటిజెన్స్.