Advertisementt

బోయపాటికి కెజిఎఫ్ యశ్ తగిలితే

Tue 13th Jul 2021 05:22 PM
kannada hero yash,kgf star yash,telugu project,director boyapati,boyapati - yash combo  బోయపాటికి కెజిఎఫ్ యశ్ తగిలితే
Boyapati to direct Kannada hero Yash? బోయపాటికి కెజిఎఫ్ యశ్ తగిలితే
Advertisement
Ads by CJ

మాస్ కి మారుపేరు బోయపాటి. బోయపాటి పక్కా మాస్ మసాలా డైరెక్టర్. బోయపాటి బాలయ్య తో చేసిన సింహ, లెజెండ్, అల్లు అర్జున్ సరైనోడు అందుకు ఉదాహరణలు. హీరో కత్తి పట్టి విలన్స్ మీద చేసే యాక్షన్ లో బోయపాటి మార్క్ మేకింగ్ దాగుంటుంది. అలాంటి బోయపాటి కెరీర్ లో వినయ విధేయరామ రిమార్క్ గా మిగిలిపోయింది. అయినా మరోసారి బాలకృష్ణతో అఖండ అంటూ గర్జిస్తున్నాడు. అఖండ మూవీతో బోయపాటి మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే బోయపాటి నెక్స్ట్ మూవీపై అందరిలో ఆశక్తి ఉంది.

బోయపాటికి తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో అయినా కోలీవుడ్ హీరో సూర్య తో అయినా సినిమా చేయబోతున్నాడనే టాక్ ఉంది. కానీ తాజాగా బోయపాటికి కన్నడ హీరో యశ్ తగిలాడనే టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కెజిఎఫ్ పాన్ ఇండియా మర్కెట్ లో సంచలనాలు సృష్టించింది. యశ్ కటౌట్ కి బోయపాటి సెట్ అయితే.. ఆ సినిమా పాన్ ఇండియా మర్కెట్ లో రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయం.

బోయపాటి పర భాష హీరోతోనే పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాలని చూస్తూన్నాడు. సో అలా సూర్య అయినా లేదు అంటే కెజిఎఫ్ స్టార్ యశ్ తో అయినా బోయపాటి నెక్స్ట్ ఉండొచ్చని టాక్.  

Boyapati to direct Kannada hero Yash?:

Yash in talks for a straight Telugu Project?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ