Advertisementt

లూసిఫెర్ రీమేక్ లో మరో హీరో లేనట్టేనా

Tue 13th Jul 2021 02:43 PM
chiranjeevi,director mohan raja,lucifer remake update,chiranjeevi - mohan raja,music director thaman  లూసిఫెర్ రీమేక్ లో మరో హీరో లేనట్టేనా
Chiru Lucifer Remake interesting update లూసిఫెర్ రీమేక్ లో మరో హీరో లేనట్టేనా
Advertisement
Ads by CJ

మలయాళం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ ని చిరు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ పనులు దర్శకుడు మోహన్ రాజా మొదలు పెట్టేసారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అయితే మలయాళ లూసిఫర్ లో మెయిన్ హీరోగా మోహన్ లాల్ నటిస్తే.. సెకండ్ హీరోగా పృథ్వి రాజ్ కనిపించారు. అంటే మోహన్ లాల్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో పృద్వి రాజ్ ఆయనకి బాడీ గార్డ్ గా కనిపిస్తారు. ఇప్పుడు తెలుగు ఆ రోల్ ని ఏ హీరోతో చేయిస్తారో అనే దాని మీద రకరకాల పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. అలాగే తెలుగు లూసిఫెర్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో. 

మాఫియా డాన్ గా చిరు ని చూపించబోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కాస్త నిడివి పెంచుతున్నారట తెలుగులో. ఆ ఎపిసోడ్ లోనే చిరు కి హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది అని, చిరంజీవి దాదాపుగా ఓ 15 నిమిషాల పాటు డాన్ గా కనిపిస్తాడట. ఈ ఎపిసోడ్ కోసమే మలయాళంలో పృద్వి రాజ్ చేసిన కేరెక్టర్ ని తెలుగులో ఉంచాలా.. వద్దా అనే మీమాంశలో టీం ఉందట. అంటే చిరు కి సహాయం చేసే హీరో పాత్ర తెలుగులో ఉంచాలా.. వద్దా అనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదట. పృథ్వి రాజ్ కేరెక్టర్ సినిమాకి చాలా కీలకం. కానీ చిరు ఆలోచన బట్టి అది ఉంచాలా.. తియ్యాలా.. అనేది ఆలోచిస్తారని తెలుస్తుంది. 

Chiru Lucifer Remake interesting update :

Chiranjeevi - Mohan Raja Lucifer remake update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ