Advertisementt

కాజల్ మనసు మంచిది

Tue 13th Jul 2021 11:18 AM
actress kajal agarwal,kajal agarwal,became english teacher,corona second wave  కాజల్ మనసు మంచిది
Kajal Agarwal Became English Teacher కాజల్ మనసు మంచిది
Advertisement
Ads by CJ

గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్.. ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఆఫర్స్ పట్టేసింది. ఇప్పటికి అదే గ్లామర్ ని కంటిన్యూ చేస్తున్న కాజల్ అగర్వాల్ పర్సనల్ లైఫ్ లోను సెటిల్ అయ్యింది. గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ కెరీర్ లో సీనియర్ హీరోల సినిమాలకి పరిమితమవుతుంది. చిరు తో ఆచార్య సినిమా, నాగార్జున తో మరో యాక్షన్ మూవీ చేస్తున్న కాజల్ అగర్వాల్ గత ఏడాది లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూనే ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరయ్యి మెటాఫిజిక్స్‌, ఖగోళశాస్త్రం లాంటి సబ్జక్ట్స్ లో తెలివితేటలు పెంచుకున్నట్టుగా చెప్పింది. 

కానీ సెకండ్ వేవ్ టైం లో అలాంటివి కుదరలేదని.. లాక్ డౌన్ వలన చాలామంది స్టూడెంట్స్ చదువుని నష్టపోతున్నారని గ్రహించిన నేను.. మా పనిమనిషి ఐదేళ్ల కొడుకుకి పాటలు చెప్పాలని నిర్ణయించుకుని.. ఆ అబ్బాయికి ఇంగ్లీష్ టీచర్ గా మారిపోయి మరీ పాఠాలు చెప్పిందట. గత కరోనా టైం లోనే క్యాబ్ డ్రైవర్ విషయంలో సహాయం చేసిన కాజల్ ఇప్పుడు పని మనిషి పిల్లాడికి ఇలా చదువు చెప్పి తన పెద్ద మనసు చాటుకుంది అంటూ కాజల్ అగర్వాల్ అభిమానులు మా హీరోయిన్ని చూసి నేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

Kajal Agarwal Became English Teacher:

Actress Kajal Agarwal Became English Teacher

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ