Advertisementt

క్రేజీ ఫాన్స్.. క్రేజీ పోస్టర్స్

Tue 13th Jul 2021 09:50 AM
kamal vikram,fan made posters,allu arjun - charan - pawan,ntr - mahesh - prabhas  క్రేజీ ఫాన్స్.. క్రేజీ పోస్టర్స్
Crazy Fans - Crazy Posters క్రేజీ ఫాన్స్.. క్రేజీ పోస్టర్స్
Advertisement
Ads by CJ

ఫాన్స్ కి ఏదైనా పోస్టర్ నచ్చింది అంటే తమ హీరోలను ఆ పోస్టర్ ఫేస్ కి అతికించెయ్యడమో.. లేదంటే అదే పోస్టర్ మాదిరిగా రీ డిజైన్ చెయ్యడమో చేస్తూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు.  ఈమధ్యన ఆర్.ఆర్.ఆర్ నుండి రిలీజ్ అయిన ఎన్టీఆర్ - రామ్ చరణ్ బైక్ పోస్టర్ నే తీసుకోండి.. ఆ పోస్టర్ ని రకరకాల హీరోల ఫేస్ లతో తెగ వైరల్ చేసారు. ఎన్టీఆర్ - బాలకృష్ణ, ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్, రామ్ చరణ్ - పవన్, అల్లు అర్జున్ - రామ్ చరణ్ ఇలా దానిని రకరకాలుగా మార్చేశారు. తాజాగా తమిళంలో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న విక్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. 

ఆ లుక్ లో కమల్ కి రైట్ సైడ్ విజయ్ సేతుపతి, లెఫ్ట్ సైడ్ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఉన్నారు. ఆ పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే పోస్టర్ తో మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ని కమల్ ప్లేస్ లో పెట్టి.. ఎడా పెడా పవన్, రామ్ చరణ్ ఫొటోస్ ని పెట్టిసి ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క మహేష్ ని కమల్ ప్లేస్ లో పెట్టి లెఫ్ట్ సైడ్ ఎన్టీఆర్, రైట్ సైడ్ ప్రభాస్ ఫొటోస్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Crazy Fans - Crazy Posters:

Kamal Vikram Fan Made poster viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ