టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా షూటింగ్స్ తో సందడి చేస్తున్నారు. సెకండ్ వేవ్ తో ఆగిపోయిన షూటింగ్స్ మళ్ళీ మొదలవ్వడంతో టాలీవుడ్ కళకళలాడుతుంది. తాజాగా అఖిల్ ఏజెంట్, RAPO19 షూటింగ్స్ ఈ రోజే మొదలయ్యాయి. ఇక మహేష్ బాబు సర్కారు వారు పాట షూట్ రెస్యూమ్స్ ఈ రోజే స్టార్ట్ అయ్యింది. సెకండ్ వేవ్ కి ముందు వరకు ఎంతో స్పీడుగా సాగిన సర్కారు వారి పాట షూటింగ్.. సెకండ్ వేవ్ ఉధృతితో వాయిదా వెయ్యకతప్పలేదు. మహేష్ అండ్ టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహేష్ బాబు మేకప్ మ్యాన్ కరోనా బారిన పడడంతో మహేష్ ఫ్యామిలి కూడా కొన్నాళ్ళు హోమ్ క్వారంటైన్ లోనే ఉండిపోయారు. ఇక తాజాగా పరిస్థితులు చక్కడడంతో టీం మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని మరీ రంగంలోకి దింగింది.
చాలా రోజుల తర్వాత ఈ రోజే మహేష్ మేకప్ వేసుకుని సర్కారు వారి పాట షూట్ కి హాజరయ్యారు. అలాగే సర్కారు వారి పాటలో కీలక పాత్రలు చేస్తున్నప్రకాష్ రాజ్, హీరోయిన్ కీర్తి సురేష్ లు కూడా షూట్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమాలో హీరో అర్జున్ ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే.. కోలీవుడ్ నటుడు సముద్రఖని మహేష్ కి విలన్ గా నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు పరశురామ్ ఈ షెడ్యూల్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు.