Advertisementt

ఏపీ లో ఆంక్షలు

Mon 12th Jul 2021 01:53 PM
ap government,ap cm jagan,covid-19 curfew,ap,all districts  ఏపీ లో ఆంక్షలు
AP Govt Key Decision On Covid-19 Curfew Timings ఏపీ లో ఆంక్షలు
Advertisement
Ads by CJ

కోవిడ్‌ నియంత్రణ చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకుండా బయట తిరిగితే 100 రూపాయల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే అంటూ ఆజ్ఞలు జారీ చేసారు. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్‌కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ఆదేశించారు. అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత అమల్లోకి కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

AP Govt Key Decision On Covid-19 Curfew Timings:

AP Govt Decision On Covid-19 Curfew 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ