రామ్ - లింగుసామి కాంబోలో RAPO19 మూవీ అధికారికంగా నేడు షూటింగ్ మొదలు పెట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కి ముందే RAPO19 అనౌన్సమెంట్ వచ్చినా.. సెకండ్ వేవ్ తగ్గాక.. నేడు RAPO19 షూటింగ్ మొదలు పెడుతున్నట్టుగా ఈ రోజు అధికారికంగా అప్ డేట్ ఇచ్చింది టీం. ఈ సినిమాకి దేవి శ్రీ సంగీతమందిస్తుండగా.. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. లింగుసామి రామ్ తో తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి మాస్ టైటిల్ గా ఉస్తాద్ ని పెట్టబోతున్నారంటూ ఓ న్యూస్ ప్రచారంలో ఉంది.
తాజాగా ఈ సినిమాలో రామ్ కి విలన్ గా ఓ తమిళ హీరో నటించబోతున్నాడని తెలుస్తుంది. గతంలో తమిళ్ హీరో మాధవన్ రామ్ కి విలన్ గా RAPO19 లో నటించబోతున్నాడని అనగానే మాధవన్.. నేను ఈ సినిమాలో విలన్ గా చెయ్యడం లేదు, నన్నెవరూ సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తమిళ హీరో ఆర్య రామ్ కి RAPO19 లో విలన్ గా నటించబోతున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా ఆకట్టుకున్న ఆర్య డబ్బింగ్ సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్నహీరో. ఇక ఆర్య అయితే RAPO19 కి తెలుగు అటు తమిళ్ లోకూడా హైప్ వస్తుంది అని లింగుసామి భావిస్తున్నారట.