గత ఏడాది కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో థియేటర్స్ క్లోజ్ అవడంతో సూర్య హీరోగా నటించి నిర్మించిన ఆకాశం నీ హద్దురా సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యింది. సుధా కొంగర దర్శకత్వంలో కెప్టెన్ గోపినాధ్ బయోపిక్ గా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య, హీరోయిన్ అపర్ణ బాలమురళి పెరఫార్మెన్స్, సుధా కొంగర మేకింగ్ అన్ని సినిమాని ఆకాశంలో నిలబెట్టాయి. తెలుగు, తమిళ్ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు హిందీలోకి వెళ్లబోతుంది.
బాలీవుడ్ లో ఆకాశం నీ హద్దురా మూవీ ని రీమేక్ చెయ్యబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ రీమేక్ కి దర్శకత్వం సుధా కొంగరనే చేస్తున్నారు. హీరోగా సూర్య నే కంటిన్యూ అవుతున్నట్లుగా ప్రకటించారు. కెప్టెన్ గోపినాధ్ బయోపిక్ ఇప్పుడు తమిళ్ నుండి హిందీకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా టీం అంతా ఓ పిక్ తో పాటుగా హిందీ రీమేక్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చారు.